రెండో సారి సీఎంగా మ‌మ‌తా బెన‌ర్జీ

హైద‌రాబాద్, మే 27 : మొత్తానికి ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌ల ఆశిస్సుల‌తో … పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రెండోసారి శుక్ర‌వారం ప్రమాణస్వీకారం చేశారు. బెంగ‌ల్ గవర్నర్ కేఎన్ త్రిపాఠీ మమత బెన‌ర్జీతో ప్రమాణస్వీకారం చేయించారు. 41 మంది ఎమ్మెల్యేలను ఈ కేబినేట్ లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి వ‌ర్గంలో 17 మంది న్యూ మెంబ‌ర్స్ కు అవకాశం కల్పించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి జైట్లీ, బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్జేడీ నేత‌ లాలు ప్రసాద్ యాదవ్, యూపీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు.

Author: admin