కేంద్ర చట్టానికి మిషన్ కాకతీయ స్పూర్తి

హైద‌రాబాద్, మే 29 : కేంద్రం తీసుకు రానున్న నీటి నిర్వహణ చట్టానికి స్పూర్తి తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ పధకాలేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇలాంటి చట్టాన్ని కేంద్రం తీసుకురావాలన్న ఆలోచన వెనుక తెలంగాణ పధకాలు ఉండడం పట్ల టి.ఎస్. నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆదివారంనాడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ‘జాతీయ వాటర్ ఫ్రేమ్ వర్క్ – 2016’ పేరిట కేంబ్ర జలవనరుల శాఖ ముసాయిదాను విడుదల చేసింది. దీన్ని అన్ని రాష్ట్రాలకు పంపారు. జూన్ 25లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. ఈ ముసాయిదాను తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఆహ్వానించారు. నీటిీ వినియోగాన్ని ప్రాధమిక హక్కుగా ప్రాధాన్యమివ్వాలని, తర్వాత ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, జీవనోపాధికి ప్రాధాన్యమివ్వాలని ఈ ముసాయిదాలో చేర్చడం పట్ల జాతీయ జలవనరుల సమన్వయ కమిటీలో సభ్యుడిగా ఉన్న హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.కేంద్ర ప్ర‌భుత్వం మిష‌న్ కాక‌తీయ‌ ప‌ద్థ‌తిలో అన్ని రాష్ట్రాలు నీటి నిల్వ‌ల‌ను పెంచుకోవాల‌ని సూచించింది కూడా. నీతి ఆయోగ్ కూడా మిష‌న్ కాక‌తీయ అద్బుత‌మ‌ని కొనియాడి… అంద‌రూ మిష‌న్ కాక‌తీయ బాట‌లో న‌డ‌వాల‌ని అన్ని రాష్ట్రాల సీఎంకు లేఖ‌లు రాసింది. కేంద్రం మ‌రో అడుగు ముందుకేసీ దేశ‌వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల వాట‌ర్ ఫాండ్స్ ( నీటి కుంట‌లు) నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది.
ఓవైపు దేశంలో క‌రువు త‌రుముకొస్తుంది. మ‌రోవైపు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటిపోతున్నాయి. ఇపుడు కేంద్రం ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం నీటిని ఒడిసిప‌ట్టుకోవ‌డం ఒక్క‌టే. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క స‌హా ప‌లు ద‌క్షిణాది రాష్ట్రాలు క‌రువు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఉత్త‌రాదిలోనూ నీటికి క‌ట‌క‌ట ఏర్ప‌డుతోంది. ప్రతీ వ‌ర్ష‌పు నీటి బొట్టును ఒడిసిప‌ట్టుకోవ‌డం ఒక్క మిష‌న్ కాక‌తీయ‌తోనే సాద్య‌మ‌ని గుర్తించింది కేంద్రం. ఇదే విష‌యాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చింది. అంద‌రినీ భాగ‌స్వాములు చేసేలా.. నీటి నిల్వ‌ల ఏర్పాటును నిర్భందం చేసేలా బిల్లు ఉంటుంది.
రిజ‌ర్వాయ‌ర్లు క‌ట్ట‌డం, న‌దుల అనుసందానం స‌హా అనేక ప్ర‌త్నామ్నాయాల‌న్నీ ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నులు. పైగా స‌మ‌యం కూడా ఎక్కువ‌ప‌డుతోంది. కానీ మిష‌న్ కాక‌తీయ‌లో అతి త‌క్కువ ఖ‌ర్చుతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు క‌నిపిస్తున్నాయి. పైగా నీటి నిల్వ‌లు పెంచుకోవ‌డం కూడా తేలికే. వ‌ర్షాకాలం ముందు చెరువు ను పున‌రుద్ద‌రిస్తే.. ఆ వెంట‌నే వాన‌లు కురుస్తాయి. నీటిని నిల్వ చేసుకోవ‌డం తేలిక‌. గ్రామ స్థాయిలోనే చెరువుల‌లో నీరు అందుబాటులో ఉంటుంది. భూగ‌ర్బ జ‌లాలు కూడా పెరుగుతాయి. ప‌ర్యావర‌ణానికి అవ‌స‌ర‌మైన నీరు ల‌భ్యమవుతోంది. అడవులు, ప‌శుగ్రాసం పుష్క‌లంగా ల‌భిస్తుంది. కాలువలు, న‌దులైతే కేవ‌లం వ‌ర్షాకాలంలో ప్ర‌వ‌హించి వెళ్లిపోతాయి. కానీ చెరువులు, కుంట‌లు, వాట‌ర్ పాండ్స్ రూపంలో నీరు నిల్వ చేస్తే.. ఏడాది పొడ‌వునా నీరందుబాటులో ఉంటుంది. అందుకే కేంద్రం మోడ‌ల్ బిల్లులో ఈ అంశాల‌ను చేర్చింది.గ‌తంలో ఉన్న బిల్లు కేవ‌లం నీటి స‌ర‌ఫ‌రాకు, జ‌లాశ‌యాల‌ను నిర్మాణాల‌కు సంబంధించిందే కావ‌డంతో… సామాజిక బాధ్య‌త‌ను పెంచుతూ ముసాయిదా బిల్లు కు కేంద్రం రూపొందించింది.
నీటి పారుద‌ల మంత్రిగా బాద్య‌తలు చేప‌ట్టిన మంత్రి హ‌రీష్ రావు.. కేంద్రం జ‌ల స‌మ‌న్వ‌య సంఘం క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యాక‌.. మిష‌న్ కాక‌తీయ‌కు మ‌రింత గుర్తింపు వ‌చ్చింది. తెలంగాణ చేప‌ట్టిన ప‌థ‌కాలు ఢిల్లీ స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డింది.

Author: admin