రాజ్యసభకు 12 మంది భాజపా అభ్యర్థుల పేర్లు

హైద‌రాబాద్, మే 29 : భాజపా 12 మంది రాజ్యసభ అభ్యర్థులను ఈ రోజు ప్రకటించింది. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా వెంకయ్యనాయుడు, ఓంప్రకాశ్‌ మాథుర్‌, హర్షవర్థన్‌సింగ్‌, రాంకుమార్‌ వర్మ పోటీ చేయనున్నట్లు ఆపార్టీ ప్రకటించింది. అలాగే కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌, హర్యానా నుంచి చౌదరి బీరేంద్రసింగ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాంవిచార్‌ నేతం, బిహార్‌ నుంచి గోపాల్‌ నారాయణ్‌సింగ్‌ జార్ఖండ్‌ నుంచి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, గుజరాత్‌ నుంచి పురుషోత్తం రూపాలా, మధ్యప్రదేశ్‌ నుంచి అనిల్‌ మాధవ్‌ దవే పోటీ చేయనున్నారు.

Author: admin