భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 6 లక్షల పరిహారం ఇస్తాం : హరీష్ రావు

హైద‌రాబాద్, మే 29 : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టడం సరికాదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. భూ నిర్వాసితులను తప్పకుండా అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 6 లక్షల పరిహారం ఇస్తామన్నారు మంత్రి. ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని ఆయన‌ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. 2013-భూసేకరణ చట్టం కంటే ఎక్కువ పరిహారం ఇస్తున్నామని మంత్రి చెప్పారు.

Author: admin