పొగాకు వాడకాన్ని నియంత్రిద్దాం

ministers-sub-metting-1f.jpg

హైద‌రాబాద్, మే 31 : క్యాన్స‌ర్ లాంటి వ్యాధుల‌ని  నివారిద్దాం
వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి
ప్ర‌జ‌ల బ‌త‌కులను పొగ‌చూరిస్తున్న‌ పొగాకు వాడకాన్ని నియంత్రించి, క్యాన్స‌ర్ లాంటి ప్రాణాంత‌కవ్యాధుల నుంచి ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రంఉంద‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిడాక్ట‌ర్ చ‌ర్ల‌కోల ల‌క్ష్మారెడ్డి అన్నారు. ప్ర‌పంచపొగాకు వ్య‌తిరేక దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకునిన‌గ‌రంలోని ఎంఎన్‌జె ప్ర‌భుత్వ క్యాన్స‌ర్వైద్య‌శాల‌లో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలోమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోర్చుగీసువాళ్ళ ద్వారా మ‌న దేశానికి వ‌చ్చిన పొగాకుప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాణాంత‌క మ‌హ‌మ్మారిలామారింద‌న్నారు. పొగాకుని నిషేధించాల్సినఅవ‌స‌రం ఉంద‌న్నారు. పొగ తాగే అల‌వాటుకార‌ణంగా అనేక మంది క్యాన్స‌ర్ లాంటి వ్యాధులబారిన ప‌డుతున్నారు. అలా చ‌నిపోయిన వాళ్ళకుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయ‌న్నారు. 2005లోనే ఎంఎన్‌జె వైద్య‌శాల‌కు ప్ర‌పంచ ఆరోగ్యసంస్థ, కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌శంస‌లు ల‌భించాయ‌న్నారు. క్యాన్స‌ర్ నివార‌ణ‌లోవైద్య‌శాల చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.ఎంఎన్‌జె వైద్య‌శాల అభివృద్ధికి కోట్లాదిరూపాయ‌లు వ్య‌యం చేస్తున్నామ‌న్నారు.అద‌నంగా కొత్త బ్లాక్‌ని నిర్మిస్తున్నామ‌ని చెప్పారు.రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లోక్యాన్స‌ర్ నిర్ధారిత ప‌రీక్ష‌ల కోసం అధునాత‌నప‌రికాల‌ను కూడా అందిస్తున్నామ‌న్నారు మంత్రి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా నోటోబాకో డే రావ‌డం యాదృచ్చికం కాగా,తెలంగాణ ఆవిర్భావ వారోత్స‌వాల సంద‌ర్భంగాప్ర‌జ‌లంతా పొగాకును వాడ‌బోమ‌న్న ప్ర‌తినబూనాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్ర‌జ‌ల‌కుపిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే జాఫ‌ర్ హుసేన్‌,వైద్య‌శాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జ‌య‌ల‌త‌, వైద్య‌శాలడాక్ట‌ర్లు, సిబ్బంది, ప‌లువురు రోగులు పాల్గొన్నారు.

Author: admin