ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను అందరికి తేలిసే విధంగా ఏర్పాట్లు : వేణుగోపాల చారి

sweet-merroies-1f.jpg

హైద‌రాబాద్, మే 31 : జూన్ 2న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌కు అందరూ విచ్చేసి రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తిలకించాలని తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి డా.వేణుగోపాల చారి తెలిపారు. మంగళవారం నాడు ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సారి నిర్వహించబోయే రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను అందరికి తేలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. దేశ రాజధానిలో నిర్వహించతలపెట్టిన ఆవిర్భావ వేడుకలతో మరోసారి తెలంగాణ ఖ్యాతి, అభివద్ధి పథకాలను దేశ ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. 2 ఏళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే దిశలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రధాని మోడితో పాటూ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మన్ననలను పొందిన విషయాన్ని ఆయన ఈ సంధర్బంగా గుర్తు చేసారు. ఐటీ, పారిశ్రామిక పాలసీలపై ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదికపై వచ్చే కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులకు వివరిస్తామని ఆయన తెలిపారు. అమరవీరుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం ఎన్నటికీ మర్చిపోదని, వారి త్యాగాలకు గుర్తుగా అమరవీరుల కుటుంబాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, చేయూతనివ్వనున్నట్లు ఆయన తెలిపారు. షాది ముబారక్, వృద్ధాప్య పించన్లు, గ్రామజ్యోతి, హరిత హారం, కళ్యాణ లక్ష్మీ వంటి అనేక పథకాలు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ని దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిపాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆవిర్భావ వేడుకలకు తీసిపోకుండ, దేశ రాజధానిలో కూడా ఘనంగా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని, ఆ దిశగానే ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటుతూ, అందర్ని ఆకట్లుకునేలా పలువురు ప్రముఖులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జానపద కళలు, తెలంగాణ ప్రభుత్వ పథకాలను వివరించే నృత్య రూపకం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలోని వివిధ కళాశాలల విద్యార్థుల బృందంతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా స‌మావేశంలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి డా.వేణుగోపాలా చారితో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి రామచంద్రుడు తేజావత్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ శశాంక్ గోయల్ పాల్గొన్నారు.

Author: admin