భావి పౌరులకు మాత్రం రోల్ మోడల్ మిష‌న్ కాక‌తీయ

kcr-apple-opeing-2f.jpg

హైద‌రాబాద్, మే 31 : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు మానస పుత్రిక మిషన్ కాకతీయ పథకం. విపక్షాలకు ఇదో విమర్శనాస్త్రంగా మారితే… భావి పౌరులకు మాత్రం రోల్ మోడల్ ఐయింది. ఈమధ్య ఎక్కడికెళ్లినా… మిషన్ కాకతీయ తీమ్ తో ప్రదర్శనలు తారసపడుతున్నాయి. సరిగ్గా ఇదే అంశాన్ని తమ ప్రదర్శనకు తీమ్ గా ఎంచుకొన్నారు చిన్నారి విద్యార్థులు.

గత యాబై రోజులుగా తెలంగాణ జవహర్ బాల భవన్ లో నిర్వహించిన వేసవి శిబిరంలో చిన్నారి బాలలు మిషన్ కాకతీయఫై ఏకంగా ఓ చిన్నపాటి పరిశోధన చేశారు. సైన్స్ టీచర్ రాజేశ్వరి మార్గదర్శనలో విద్యార్థులు తామే స్వయంగా అనేక అంశాలపై ఇష్టాగోష్ఠులు నిర్వహించారు.

shivkeshav-2-f.gif

భూతాపం, కాన్సర్ లాంటి లైఫ్ స్టయిల్ వ్యాధులు, వర్షపునీటి వినియం, శాటిలైట్ టెక్నాలజీ, స్వచ్ఛ హైదరాబాద్ -పట్టణ చెత్త నియంత్రణ, బయోడివర్సిటీ, ఎన్నో అంశాలను సైన్స్ టీచర్ రాజేశ్వరి విద్యార్థులకు బోధించారు. బాల్యంలోనే సైన్స్ పట్ల జిజ్ఞాస పెరిగితే భవిష్యత్ లో అది సృజనాత్మకతకు బాటలు వేస్తుందంటారు సైన్స్ ఉపాధ్యాయురాలు. పౌరులలో సృజనాత్మక ఎన్నో భవిషత్ ఆవిష్కరణలకు దోహదపడుతొందని ప్రముఖ శాస్త్రవేత్తల విశ్లేషణ.సరిగ్గా ఈఅంశం ఆధారంగానే బాలభవన్ సైన్స్ విభాగం అనేక సదస్సులునిర్వహిస్తుందని సంస్థ డైరక్టర్ సుధాకర్ తెలిపారు. గత యాబై రోజుల వేసవి శిబిరం నేటితో ముగిసిందని నిర్వాహకులు వెల్లడించారు. 

shivkeshav-3-f.gif

మిషన్ కాకతీయ

సేద్యం గాడిలో పడకపోతే గాసానికి గోసపడాల్సిస్తోంది. ఎనభై శాతానికి పైగా గ్రామీణులు ఆధారపడ్డ వ్యవసాయం ఆటకెక్కితే అభివృద్ధి అదఃపాతాళం లోకే..అందుకే వ్యవసాయ రంగాన్ని ముందేసుకొన్నారు మన సీఎం. 

shivakeshav-4-f.gif

కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి వర్షపు నీటి వినిమాయాన్ని పెంచాలన్నది ఆయన ఆకాంక్ష. దానికి నాయకుల నుంచే కాదు జనం నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.అందుకే తాగు- సాగు నీరు, వర్షపు నీటి వినిమయం పట్ల పిల్లలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.వర్షాభావ ప్రాంతాల్లో వర్షపు నీటి వినిమాయం పై వీడియోల ద్వారా బోధించినట్లు సైన్స్ టీచర్ రాజేశ్వరి తెలిపారు.యాబై రోజుల వేసవి శిబిరం నేటితో ముగిసినట్లు నిర్వహకులు తెలిపారు.

Author: admin