రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా : డి. శ్రీనివాస్

kcr-water-metting-1f.jpg

హైద‌రాబాద్, మే 31 : రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు రాజ్యసభ టీఆర్‌ఎస్ అభ్యర్థి డి. శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన త‌రువాత డీఎస్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని డి. శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు బ్రహ్మాండమైన విజన్ ఉందని కొనియాడారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణకు తాను సైతం కేసీఆర్ సారథ్యంలో పని చేస్తానని చెప్పారు.

Author: admin