రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతా : కెప్టెన్ లక్ష్మీకాంతరావు

harishParamarsha-4-f.jpg

హైద‌రాబాద్, మే 31 : రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో పోరాడుతానని రాజ్యసభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం సారథ్యంలో పని చేస్తానని చెప్పారు.

Author: admin