వైద్య రంగాన్ని మ‌రింత‌గా అభివృద్ధి ప‌రుస్తాం : ల‌క్ష్మారెడ్డి

హైద‌రాబాద్, మే 31 : వైద్య రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామ‌న్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి. స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం మోడల్ 102, మార్చురీ వాహనాలను పరిశీలించారు మంత్రి. గర్భిణి లను ఇంటి వద్ద దింపే అమ్మవొడి వాహనాలను ప‌రిశీలించి సిబ్బంది నుంచి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. పేదవాళ్ల ఆరోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌ని అన్నార‌యాన‌. మార్చురీకి మరో 50 కొత్త అంబులెన్స్ లు తీసుకోస్తామ‌ని చెప్పారు. గాంధీ, ఉస్మానియా, జిల్లా ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేస్తామ‌న్నారు. 102 వెహికిల్స్ ద్వారా గర్భిణులను ఇంటి నుంచి హాస్పిటల్స్ వరకు, హాస్పిటల్ నుంచి ఇంటి వరకు తరాలిస్తామ‌ని ప్ర‌కటించారు మంత్రి. 102 వాహనాలు 41 రెడీగా ఉన్నాయని తెలిపారు మంత్రి ల‌క్ష్మారెడ్డి.

Author: admin