సాప్ట్ బ్యాంకు అధినేత నికేష్ అరోరాతో మంత్రి కేటీఆర్ భేటీ

kavitha-raj-nadh-sing-1f.jpg

హైద‌రాబాద్, మే 31 : సాప్ట్ బ్యాంకు అధినేత నికేష్ అరోరాతో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. శాన్ ప్రాన్సికోలో సాయత్రం జరిగిన ఈ సమావేశంలో మంత్రి తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు స్థాపన , పెట్టుబడుల అకర్షణకోసం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ప్రపంచంలోనే అత్యదిక పారితోషికం తీసుకుంటున్న సిఓఓ అయిన నిఖేష్ అరోరాతో మంత్రి సుమారు రెండు గంటల పాటు ముఖాముఖి భేటి అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశవేట్టిన పారిశ్రామిక విధానం యెక్క ఉద్దేశ్యాలను, కీలకాంశాలను మంత్రి వివరించారు. పదిహేను రోజుల్లో సరళతరమైన, పారదర్శక పద్దతుల్లో అన్ని అనుమతులు, సెల్ప్ సర్టిఫికేషన్ వంటి అంశాలను మంత్రి వివరించారు. పరిశ్రామిక అనుమతులకి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విధానాన్ని అభినందించిన అరోరా, ప్రభుత్వం ఈ రంగంలో అగ్ర స్ధానంలో నిలిచేందుకు కావాల్సిన పలు సలహాలను ఇచ్చారు. టెలికమ్యూనికేషన్లు మెదలు మీడియా, పైనాన్స్ వంటి రంగాల దాక పెట్టుబడులు పెట్టె జపాన్ మల్టి నేషనల్ కంపెనీ సాప్ట్ బ్యాంకు. ఈ బ్యాంకు ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ వంటి రంగాల్లోనూ అనేక బిలియన్ల పెట్టుబడులను ప్రపంచ వ్యాప్తంగా పెడుతున్నది. ఈ కామర్స్, మార్కెటింగ్ వంటి రంగాల్లోనూ సాప్ట్ బ్యాంకు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో మంత్రి తెలంగాణలో అయా రంగాల్లో ఉన్న అవకాశాలను సివోవో నిఖేష్ అరోరాకి వివరించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను(పరిశ్రామిక, ఐటి పాలసీలను) వివరించారు. తెలంగాణ ఐటి పాలసీలో ఉన్న ప్రముఖ అంశాలను, ప్రత్యేకతలను మంత్రి తెలిపారు. ఇన్నోవేషన్ రంగంలో పరిశోధనలకి ఊతం ఇచ్చేలా , వాటికి ప్రోత్సహం ఇచ్చేలా ప్రకటించిన ఇన్నోవేషన్ పాలసీని మంత్రి నికేష్ అరోరాకి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టిహబ్ గురించి, వివరించి ఇప్పటిదాకా దానికి వస్తున్న స్పందన, ఇన్నోవేషన్ రంగంలో స్టార్ట్ అప్ లకి అందివ్వాల్సిన సాయంపైన మంత్రి చర్చించారు. అరోరాతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అనేక అంశాలను ఈ సందర్భంగా చర్చించామన్నారు. సాప్ట్ బ్యాంకు పెట్టుబడులకి తెలంగాణ‌లో ఉన్న అవకాశాలను వివరించినట్టు మంత్రి తెలిపారు. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నట్టు, ఇండియానా పోలీస్, మిన్నియా పోలిస్ నగరాల్లో జరిగిన సమావేశంలో అమెరికన్ పారిశ్రామిక వేత్తలు తమ రాష్ర్టాల్లోనూ తెలంగాణ పారిశ్రామిక విధానంలోని పటు అంశాలను ప్రవేశపెట్టాలన్న అభిలాషను వ్యక్తం చేసినట్టు మంత్రి సమావేశంలో నికేష్ అరోరాతో తెలిపారు. ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.

Author: admin