ఘ‌నంగా 1988-89 టెన్త్ బెల్లంప‌ల్లి బ్యాచ్ పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం

హైద‌రాబాద్, మే 31 : గురువుల‌కు ల‌భించే గౌర‌వం, మ‌ర్యాద ఏ ఉద్యోగంలోనూ ల‌భించ‌ద‌ని అన్నారు సింగ‌రేణి హై స్కూల్ 1988-89 టెన్త్ క్లాస్, మ్యాథ‌మెటిక్స్ టీచ‌ర్ సుభ్ర‌మ‌ణ్యం. 1988-89 సంవ‌త్స‌ర‌పు సింగ‌రేణి హై స్కూల్ బెల్లంప‌ల్లి లో చ‌దివిన పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం ఈ నెల 23వ తేదీన సోమ‌వారం హైద‌రాబాద్ లోని వ‌న‌స్థలిపురం డీర్ పార్క్ లో జ‌రిగింది. టెన్త్ క్లాస్, మ్యాథ‌మెటిక్స్ టీచ‌ర్ సుభ్ర‌మ‌ణ్యం మాట్లాడారు.

 

singareni-school-2-f.gif

మ‌మ్మ‌ల్ని టీచర్ గా గుర్తు పెట్టుకుని మీరు ఇచ్చే ఈ అథిత్యం, స‌న్మానం జీవితం లో మ‌రువ‌లేనిద‌న్నారు. విద్యార్థుల క‌ల‌యిక అపూర్వ‌మైన‌ద‌ని… చిన్న‌నాడు మీము మీకు చెప్పే విష‌యాలు, మీ అభ్యున్నతి దోహ‌ద‌ప‌డ‌టం ఎంతో ఆనందంగా ఉంద‌ని అన్నారు సుభ్ర‌మ‌ణ్యం. ఇంగ్లీష్ టీచ‌ర్ ప్ర‌భావ‌తి మాట్లాడుతూ… మొక్క నాటిన నాడు క‌లిగే ఆనందం కంటే … ఆ మొక్క పెరిగి పెద్ద‌ద‌యి ఫలాలు ఇస్తున్న‌ప్పుడు క‌లిగే ఆనందం వెల‌క‌ట్ట‌లేనిద‌ని అన్నారామె. మా వ‌ద్ద విద్యాబుద్దులు నేర్చుకుని… ఇంత పెద్ద హోదాలో ఉండ‌టం చాలా గ‌ర్వంగా ఉంద‌ని ప్ర‌భావ‌తి అన్నారు. ఎంతో బీజీగా ఉన్న మీరు ఇలా క‌లువ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం, విద్యార్థులను చూస్తుంటే… మ‌రో జ‌న్మ‌లో కూడా ఉపాధ్యాయురాలుగా పుట్టాల‌ని ఉంద‌న్నారు. 

singareni-school-3-f.gif

ఆట పాట‌లు – గ‌త సృతుల‌తో ఉల్లాసంగా… ఉత్సాహంగా… 

1988-89 సంవ‌త్స‌ర‌పు సింగ‌రేణి హై స్కూల్ బెల్లంప‌ల్లి లో చ‌దివిన పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం ఈ నెల 23వ తేదీన సోమ‌వారం హైద‌రాబాద్ లోని వ‌న‌స్థలిపురం డీర్ పార్క్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు క‌ల‌యిక అపూర్వంగా- అప్యాయంగా మారింది. ఒక్కొక్క‌రు పాత స్నేహితుల‌ను చూసుకుని మురిసిపోయారు. ఒక్కొక్క‌రిని ఏలా ఉన్నారా?… అంటూ అప్యాయంగా ప‌లుక‌రించుకున్నారు ప్ర‌తి ఒక్క‌రు. ప్ర‌తి ఏడాది ఇలా క‌లువ‌డానికి ఏర్పాటు చేసుకునేందుకు ప్ర‌త్యేకంగా హ‌డ్ హ‌క్ క‌మిటీని కూడా నియ‌మించుకున్నారు ఈ బ్యాచ్ విద్యార్థులు. ఈ కార్య‌క్ర‌మంలో ఆట పాట‌ల‌తో పాటు ప‌సందైన విందు భోజ‌నం ఏర్పాటు చేసుకోవ‌డం విశేషం. 

singareni-school-4-f-.gif

ఈ కార్య‌క్ర‌మానికి సింగ‌రేణి హై స్కూల్ ఉపాధ్యాయుల‌తో పాటు 1988-89 టెన్త్ క్లాస్ 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. హ‌డ్ హ‌క్ క‌మిటీలో అంజ‌న్ కుమార్, రాజేంద‌ర్, స‌త్య రాజు, వాస‌వీ, కే రామేశ్వ‌ర్, కే శ్రీనివాస్, వినోద్, విన్స‌న్ సేథ్, ఎన్ రవీ, శైల‌జాలు ఉన్నారు. ఇక హాజ‌రైన వారిలో సీహెచ్ వెంక‌ట‌స్వామి, ఎన్ స‌త్య‌నారాయ‌ణ‌, శైల‌జా, వాస‌వి, సుధాక‌ర్, ఆనంద్ భారతీ, రాజేంద్ర ప్ర‌సాద్, క‌విత‌, అంజ‌న్ స‌లేమాన్, హేమ‌ల‌త‌, ఇర్షాద్, రమ‌ణ‌బాబు, విన్సన్ సేథ్, ఖ‌లీమ్, అస్రాఫ్, జావిద్, సౌదిలు ఉన్నారు.

Author: admin